బూర్గంపహడ్ మండల కేంద్రంలో గురువారం మండల ప్రధాన కూడలిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వారి సమస్యలపై 11వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా మానవహారం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు గౌరవ వేతనం మాకొద్దు- కనీస వేతనం కావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధికి చెందిన అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.