బూర్గంపాడు మండలం తాళ్లగోమ్మూరులో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే పాయంతో కలిసి మంగళవారం ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పాయం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.