డిసెంబర్ 4న జరిగే పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ ఎన్ఏఎస్-2024 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్. మాధవరావు గురువారం సూచించారు. ఈ పరీక్షకు సంబంధించి క్షేత్ర పరిశీలకులుగా ఎన్నికైన ఛాత్రోపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని సుజాతనగర్ మండలంలోని మదీనా బీఈడీ కళాశాలలో ప్రారంభించారు.
చిత్తశుద్ధితో నిర్వహించి సరైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.