అందరూ బాగుండాలని మహిళలు కోరుకునే పండుగ బతుకమ్మ పండుగని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణ ప్రాంతాల్లోని పలు బస్తీల్లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి ఆడి పాడి ఉత్సహపర్చారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతిభింబమని, ప్రపంచదేశాల్లో స్థిరపడిన కుటుంబాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.