భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం రాచరపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్ద రాముడు గారి ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ కబడ్డీ క్రీడలను బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొరగారు వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు.
అనంతరం మడకం ప్రసాద్ గారు మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా గ్రామములో ఉన్న యువత యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా మానసికంగా ఉత్సాహంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరమని చెప్పుకొచ్చారు.
గ్రామ నాయకుల సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా జై భీమ్ అని తెలియజేశారు అలాగే రానున్న కాలంలో ప్రతి ఒక్కరి ప్రతి విషయంలో కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు అక్క చెల్లెలు అమ్మవారి ఆశీస్సులతో కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఆర్థికంగా మానసికంగా ప్రతి ఒక్కరూ ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పెద్దలు యువత యువకులు పెద్ద సంఖ్యలో హాజరైనారు అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.