భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్వేరోస్ ఇంటర్నేషనల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం జరిగింది. స్వేరోస్ జిల్లా అధ్యక్షులు బత్తిని వీరయ్య మాట్లాడుతూ.. టి.జి.పి.ఏ, స్వేరోస్ సర్కిల్, టీ.టీ.సీ ఫిట్ ఇండియా సంఘాల నాయకులు అందరు మాతృసంస్థ అయినటువంటి స్వేరోస్ సభ్యత్వాన్ని విధిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర నాయకులు గొర్ల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవి, జాయింట్ సెక్రెటరీ జై భీమ్ రవీందర్, జిల్లా కమిటీ సభ్యుడు వి.నోహిత్ కుమార్, జగ్జీవన్ రావు, ఎస్ రవి, సిఆర్వో చిరంజీవి, టి.జి.పి.ఏ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి పురుషోత్తం, సిహెచ్ దుర్గ, కొత్తపల్లి రవి, సిహెచ్ మురళి, లక్ష్మి, వెంకటేశ్వర్లు, మురళి, సంధ్యారాణి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.