పాల్వంచ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన నాగారం దంతల బొర ఎస్సీ కాలనీలో సోమవారం డీసీఎంఎస్ ఛైర్మన్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో పంట నష్టం జరిగిందని కొత్వాల అన్నారు. ఇటీవల తరచుగా భారీ వర్షాలు పడి రైతులు నష్టపోతున్నారని, అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు.