కొత్తగూడెం పట్టణంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశంలో డివైఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు కోటా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.