అనాధలు, అభాగ్యులను, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని అక్కున చేర్చుకొని వారి జీవితానికి భరోసా కల్పించిన బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ ధన్య జీవి అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ అధికారిక జయంతి వేడుకలో పాల్గొని మాట్లాడారు. ఆయన అడుగుజాడల్లో నేటితరం నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. చెడు వ్యసనాలతో కూరుకుపోతున్న జాతిని జాగృతం చేశారని అన్నారు.