కొత్తగూడెం జిల్లాలోని మండలాలలో ప్రతివారం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ శిబిరాన్ని శారీరక వైకల్యంతో పాటు ఇతర వైకల్యాలు కలిగిన పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సైదులు గురువారం తెలిపారు. జిల్లాలోని 23 మండలాలలో ఉన్న 30 భవిత కేంద్రాలలో వైకల్యంతో ఉన్న పిల్లలకు తగిన శిక్షణ ఇస్తున్నారని, దివ్యాంగ పిల్లలలో వారి సామర్థ్యాలు పెంచేందుకు భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.