కొత్తగూడెంలోని స్థానిక శేషగిరి భవన్ లో గురువారం సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ గా ఏర్పడి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల రైతు నాయకులు మాట్లాడుతూ. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్ ల వలన కనీస వేతనం ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఎనిమిది గంటల పని దినం హక్కులు వంటి హామీలను రద్దు చేస్తున్నారన్నారు.