పాల్వంచ పట్టణంలోని నవభారత్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ బుధవారం సందర్శించారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాల, ఇతర వసతులను ఆయన పరిశీలించారు. సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవన మరమ్మతుల గురించి ఆయన దృష్టికి తీసుకు రాగా అంచనాలు పంపాలని అధికారులను ఆదేశించారు. జోనల్ అధికారి స్వరూపారాణి, ప్రిన్సిపల్ మైథిలి ఆయన వెంట ఉన్నారు.