సర్వర్ ప్రభావంతో పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్లను వెంటనే అప్ లోడ్ చేయాలని తహశీల్దార్ మామిడి అశోక్ కుమార్ మీసేవ ఆపరేటర్లకు సూచించారు. సోమవారం దుమ్ముగూడెం తహశీల్దార్ ఛాంబర్లో మండలంలోని మీసేవ ఆపరేటర్లు, గిర్దావర్లతో సమావేశం నిర్వహించారు. మీసేవ నిర్వాహకులు వివిధ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసినందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాలన్నారు.