భద్రాచలం ఐటీడీఏలో సోమవారం ఉదయం 10. 30 గంటలకు గిరిజన దర్బారు ఉంటుందని, సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని పీఓ రాహుల్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజనులు తమ సమస్యలను వినతులను రాతపూర్వకంగా తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ కృషి చేస్తుందని తెలిపారు.