భద్రాచలం గిరిజన మహిళా ఏఎన్ఎం పాఠశాలలో రెండేళ్లపాటు ఉండే ఎంపీహెచ్ డబ్ల్యూ (మహిళ) కోర్సులో అర్హులైనవారు చేరాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 వరకు దరఖాస్తులను స్థానిక ఎంపీహెచ్ డబ్ల్యూ శిక్షణ పాఠశాలలో అందించాలని సూచించారు. ఇంటర్మీడియట్లోని ఏ గ్రూపు వారైనా 17 సంవత్సరాలు నుంచి ఆపై వయసున్న గిరిజన మహిళా అభ్యర్థులు ఇందుకు అర్హులని వివరించారు.