భద్రాచలం గ్రామపంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం మహిళలకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అందించిన చీరలతో మహిళలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.