మినీ స్టేడియం స్థల సేకరణకు సన్నాహాలు

74பார்த்தது
మినీ స్టేడియం స్థల సేకరణకు సన్నాహాలు
అశ్వారావుపేటలో మినీ స్టేడియం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. అశ్వారావుపేట-జంగారెడ్డి గూడెం రోడ్డులో గల నీటిపారుదల శాఖ కార్యాలయ భవన సముదాయం ప్రాంగణంలోని ఖాలీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, సర్వేయర్ నాగరాజు, నాయకులు జూపల్లి రమేష్ ఆయన అనుచర వర్గం ఉన్నారు.

தொடர்புடைய செய்தி