నిధులు మంజూరై పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను చండ్రుగొండ ప్రజలు వినతి పత్రం అందించారు. పోకలగూడెం నుంచి నల్లబండబోడు వరకు, వెంకట్య తండ గ్రామపంచాయతీ వంక నెంబర్ నుండి నల్లబండబోడు వరకు బీటి రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు.