బుధవారం నాడు మధ్యాహ్నం 01: 30 గంటలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం, మండలం అశ్వారావుపేట పట్టణ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర. అశ్వారావుపేట పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు అనేది స్పష్టంగా కనిపిస్తుందని, నిర్మాణం పూర్తిచేసుకుని పది సంవత్సరాలు దాటినా కానీ నేటి కూడా గృహాలు మంజూరు చేయకపోవడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు.
స్థానిక ఎమ్మెల్యే ఏ ఒక్కరోజు కూడా పట్టణ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించిన సందర్భమే లేదని చెప్పుకొచ్చారు. నిరుపేదలకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనేది స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే పరాజయం తప్పదని గ్రామస్తులే చెపుతున్నారాన్నరు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర, నియోజకవర్గ అధ్యక్షులు వి. నాగ మహేశ్వరరావు, క్రమశిక్షణ కమిటీ నాయకులు గొల్లమందల పెంటయ్య మండల ఇన్చార్జి కలపాల మంగరాజు మండల అధ్యక్షులు జక్కుల చిన్ని ప్రధాన కార్యదర్శి రాయల పోలయ్య, రామ్ నివాస్, పొదిలివెంకటేష్, సంగం దుర్గారావు, బేతి సురేష్, శివ, వినోద్, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.