అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శనివారం రాత్రి భారీ కొండచిలువ ప్రధాన రహదారిపై కనబడడంతో గ్రామస్తులు అందరూ కలిసి సుమారు 12 అడుగుల కొండచిలువను హతమార్చారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో కొండచిలువలు రోడ్డు మీద దర్శనం ఇస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.