పెంచికల్ పేట్ మండలంలోని సమగ్ర కుటుంబ సర్వేను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల శనివారం పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్, పంచాయతి కార్యదర్శి చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.