కాగజ్‌నగర్‌: శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

82பார்த்தது
కాగజ్‌నగర్‌: శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి
కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ నివాసంలో ఎల్కపెల్లి గ్రామ ప్రజలు, నాయకులు ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కపెల్లి గ్రామ స్మశాన స్థలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచికల్పేట్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி