సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిథిలో ఇటివల 208 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ ఆదేశానుసారం సీఐ ఏం. రమేశ్, ఎస్ఐ కమలాకర్ కేసు దర్యాప్తు చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం తెలిపారు. నిందితులకు సిర్పూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉల్లం అజయ్ 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.