రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని కొమురంభీం జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలంలోని సాకడ గ్రామపంచాయతీలో ఆయన పర్యటించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా వేసవికాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. వేసవిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.