కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయిని కలిసి వికలాంగులకు ఉన్న వివిధ సమస్యలను మెమొరాండంలో వివరిస్తూ, అన్ని సామాజిక వర్గాలకు ఉన్నట్టే, మండల కేంద్రంలో దివ్యాంగుల కోసం కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు అనిల్ కోసన్ కార్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడిసెల రాజేష్, బీరయ్య, శ్రీను, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.