పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. గంగాపూర్ జాతర సందర్భంగా ఈనెల 12న ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న పోలీసులతో మహమ్మద్ సాజీమ్, ధరావత్ శ్రీకాంత్ అనే వ్యక్తులు గొడవ పడ్డారు. గమనించిన తోటి సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించగా వారు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించిన ట్లు ఎస్ఐ తెలిపారు.