కెరమెరి మండలం జోడేఘాట్లో ఈ నెల 17న నిర్వహించే కొమరంభీం వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణక్క అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాదరావు, కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి వర్ధంతికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.