కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆసుపత్రి వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేశారు. 3 నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, చిరంజీవి, యూనియన్ అధ్యక్షుడు శ్రీశైలం, కార్మికులున్నారు.