ఆటో ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. టేకులపల్లి రాంపురం పంచాయతీకి చెందిన అశోక్ (22) ఇంటివద్దే ఉంటూ కూలీ పనులు చేస్తూ తల్లికి చేదోడుగా ఉండేవాడు. శుక్రవారం తన బైక్ పై కొత్తగూడెం వెళ్తుండగా బొమ్మనపల్లి మార్కెట్ వద్ద ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అశోక్ ను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.