కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, గిరిజన నాయకులు, తదితరులు ఉన్నారు.