HYD: కేపీహెచ్బీ కాలనీ డీమార్ట్ సమీపంలోని MIG 9/2 అపార్ట్మెంట్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 15 మంది అపార్ట్మెంట్ వాసులను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.