కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా మండలంలోని తెలగవరానికి చెందిన కస్తాల నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు షుగర్స్ కేన్ కమిషనర్ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నరేంద్ర పేరును సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రతిపాదించడంతో ఆమోదం లభించింది. కాగా, నరేంద్ర నియామకంపై పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.