తల్లాడ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ అధికారులు స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లో వాహన తనిఖీల అనంతరం వాహనంలో వెళ్తుండగా రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీ కొట్టారు. అదుపుతప్పి వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అధికారులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.