ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముమ్మరంగా పర్యటించారు. ముందుగా సోమవారం ఉదయం తొలి కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పలు ప్రజా సమస్యలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.