కల్లూరు డివిజన్ మాత్రం కుండపోత వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వరకు కల్లూరులో రికార్డు స్థాయిలో 115. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా తల్లాడలో జిల్లాలోని అధికంగా 126. 2 మిల్లీమీటర్ల వర్షపాత రికార్డ్ అయింది. అదే విధంగా డివిజన్ పరిధిలోని ఏన్కూరులో అతిస్వల్పంగా 20. 0 మిల్లీమీటర్లు, పెనుబల్లిలో 64, సత్తుపల్లిలో 32. 2 మి. మీ, వేంసూరులో 87. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.