ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బూర్గంపాడు మండలంలోని ఆరోగ్య కేంద్రాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న పలు రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అక్కడ చికిత్స పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్యాధికారులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி