కొనుగోలు కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీజ సూచించారు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె మాట్లాడారు. నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకుని కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకునేలా చూడాలన్నారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు.