దీన్ దయాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలి

76பார்த்தது
దీన్ దయాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలి
బీజేపీ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ నున్నా రవికుమార్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్రోడ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ బూత్లో 100 మందిని పార్టీలో చేర్పించాలన్నారు. అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడారు.

தொடர்புடைய செய்தி