కూసుమంచి మండలం జీళ్లచెరువులో 20 అడుగుల రావణ దహనానికి ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర భజన భక్తమండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ దహనం చేశారు. ముందుగా కనకదుర్గ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.