ఖమ్మం జిల్లా మధిర మండలంలోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలను జిల్లా పిఆర్టియు నాయకులు రంగారెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. త్వరలో రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా ఆలోచించారు. ఈ కార్యక్రమంలో మండల పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.