ప్రజాపాలన విజయోత్సవాన్ని సోమవారం మధిరలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని.. నేడు మధిరలో జయ జయహే ప్రజాపాలన కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కలెక్టర్ ప్రకటనలో కోరారు.