మధిర మండలం తొర్లపాడు-తొండల గోపవరం గ్రామాల రహదారి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైందని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు నరసింహారావు అన్నారు. కోతకు గురైన రహదారిని సోమవారం మండల సీపీఎం నాయకులు పరిశీలించారు. వరదలు వచ్చిన మొదట్లో డిప్యూటీ సీఎం ఈ రహదారిని పరిశీలించి మరమ్మత్తులు చేస్తామని చెప్పారని, ఆహామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.