ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఎస్బిహెచ్ సిరిపురం బ్రాంచ్ నందు శుక్రవారం చోరీ యత్నం జరిగింది. దీంతో ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా ఏసిపి రెహమాన్ మాట్లాడుతూ.. దొంగలు బ్యాంకు లోకి ప్రవేశించడానికి తలుపులు పగల కొట్టారు కానీ ఎలాంటి నగదును అపహరించ లేదని తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలియజేశారు.