కొత్తగా ఓటరు నమోదుకోసం దరఖాస్తు చేసుకునే విధంగా యువతీ యువకులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శనివారం ఎర్రుపాలెం తహశీల్దార్ ఉషాశారద తెలిపారు. 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు పోలింగ్ కేంద్రం వద్ద ఉండే బీఎల్ఓల వద్ద దరఖాస్తు ఫారాలు తీసుకుని ఓటరు నమోదుకు, తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.