మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఎర్రుపాలెం మండల తెలంగాణ రాష్ట్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.