బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలలో పూర్వ లెక్కల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీల విభజన ప్రభుత్వ విధానంగా పూర్తి స్థాయిలో ఆమోదం లభించకపోవడంతో టెక్నికల్‌గా ఆచరణలోకి రాలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్వ పంచాయతీల ప్రకారమే ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ప్రకటిస్తాం అని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సోమవారం తెలిపారు.