గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదిక కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ఏప్రిల్ 8, 9 తేదీలలో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 'X' వేదికగా వెల్లడించారు. 8న సీడబ్ల్యూసీ సమావేశం, 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు