తెలంగాణ మాజీ సీఎం KCR అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో పగటి కలలు కంటున్నారని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఒంటరిగా కాకుండా బీజేపీతో కలిసొచ్చినా ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి చూడలేకే KCR ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ మండిపడ్డారు.