వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆరవ రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి బతుకమ్మ ఆటపాటలతో మహిళా మణులు సందడి చేశారు. అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో ఆరవ రోజు బతుకమ్మను నిమజ్జనం చేసి దాండియా కోలాటాలు ఆడారు. సాంప్రదాయ దుస్తులతో మహిళలు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు.