రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యత పై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ లోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణలో పరిశుభ్రత పనులు పరిశీలించారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు, ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.